దగదర్తి విమనాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం
నెల్లూరు: దగదర్తి విమానాశ్రయం ఏర్పాటుతో నెల్లూరు జిల్లా పారిశ్రామికంగా, ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతుందని, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ఇది దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా వాసుల చిరకాల కోరిక అయిన దగదర్తి విమనాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో దగదర్తి విమనాశ్రయం భూసేకరణకు సంబంధించిన సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. సోమవారం అమరావతి సచివాలయంలో జిల్లా కలెక్టర్, దగదర్తి విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వపరంగా చేపట్టిన కార్యాచరణ, భూసేకరణ పురోగతి నివేదికను ప్రభుత్వానికి అందజేయగా, సదరు నివేదికను క్యాబినెట్ ఆమోదించింది. దగదర్తి విమనాశ్రయం ఏర్పాటు దిశగా విశేషంగా కృషి చేస్తున్న మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, కావలి శాసనసభ్యులు డివి కృష్ణారెడ్డికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నెల్లూరు జిల్లా వాసుల చిరకాల కోరిక అయిన దగదర్తి విమనాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో దగదర్తి విమనాశ్రయం భూసేకరణకు సంబంధించిన సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు.

