వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మారుస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం
అమరావతి: వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వం జీవో జారీ చేసింది.. దీనిపై ఇటీవల నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో జిల్లా పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కడప జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్చారు.అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం కడప పేరును తొలగించి వైఎస్సార్ జిల్లాగా పరిగణించడంపై గతంలో ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తాయి..మంత్రి సత్యకుమార్ సైతం పేరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గతంలో సీఎం చంద్రబాబుకి లేఖ రాశారు.