ఉద్యోగులకు దీపావళి కానుక-ఒక డీఏ ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం
అమరావతి: రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న ఉద్యోగులందరికీ ఎక్కడా ఇబ్బంది కలగకూడదనే ప్రయత్నం చేస్తున్నమని,,గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ విశాఖ నగరంలో పెట్టుబడులు పెట్టడం చారిత్రాత్మక ఘట్టం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి, మంత్రులు శనివారం సమావేశం అయ్యారు..చర్చల అనంతరం మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గత పాలనలో జరిగిన విధ్వంసాన్ని సరిచేస్తున్నామని,,
ఆర్ధిక అంశాలపై ఎలాంటి దాపరికం లేదు:- ఎవరినీ కించపరిచే పరిస్థితి లేదని,,ఉద్యోగులతో కలిసే రాష్ట్రాన్ని తదుపరి అభివృద్ధి స్థాయికి తీసుకెళ్లగలమని అన్నారు. రూ.51,452 కోట్లను ఎస్టాబ్లిష్ మెంట్ కోసమే వ్యయం చేస్తున్నాము అంటే 91శాతం ఖర్చు ఎస్టాబ్లిష్‌మెంట్ కోసమే వ్యయం చేస్తున్నామన్నారు. ఈ విషయంలో పొరుగు రాష్ట్రాలన్నీ గత ఐదేళ్లలో జాగ్రత్తపడ్డాయన్నారు.తెలంగాణ 38 శాతం, తమిళనాడు 42, కర్ణాటక 39 శాతానికి ఈ వ్యయాన్ని తగ్గించుకున్నాయని తెలిపారు. గత ఐదేళ్లలో సరైన నిర్ణయం తీసుకోకపోవటం వల్లే ఇబ్బందులు పడే పరిస్థితి వుందన్నారు. భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అనుత్పాదక వ్యయం కోసం ఖర్చు చేశారని వెల్లడించారు.
ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటన:-ఒక డీఎ ఉద్యోగులకు చెల్లించాలని నిర్ణయించాం.నవంబరు 1వ తేదీ నుంచి అమలు అయ్యేలా డీఏ చెల్లింపు. రూ160 కోట్ల వ్యయం అవుతుంది.పోలీసులకు 1 సరెండర్ లీవ్ క్లియర్ చేస్తాం. 2 విడతల్లో ఈ చెల్లింపులు చేస్తాం.రూ.210 కోట్లు రెండు విడతల్లో చెల్లిస్తాం.60 రోజుల్లోగా వ్యవస్థలన్నీ స్ట్రీమ్ లైన్ చేసి రియల్ టైమ్ లో ఆరోగ్య పరమైన వ్యయాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాం.180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ రిటైర్మెంట్ వరకు వినియోగించుకునే అవకాశం కల్పిస్తాం.చైల్డ్ కేర్ లీవ్స్ వినియోగంలో వయోపరిమితి లేదు.ఈ లీవ్ లను ఉద్యోగ విరమణ వరకూ వినియోగించుకునే వెసులుబాటు కల్పించాం. ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు క్లియర్ చేస్తాం. ఉద్యోగ సంఘాల భవనాలకు చెందిన ప్రాపర్టీ టాక్స్ మాఫీ చేస్తాం. 4వ తరగతి ఉద్యోగుల గౌరవాన్ని మరింత పెంచేలా రీ డెసిగ్నేట్ చేస్తామని తెలిపారు. సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, ఉన్నతాధికారులు, ఏపీఎన్జీవో, ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగ సంఘం సహా ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఆప్కాస్, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.

