వినాయక చవితి,విజయదశమికి ఏర్పాటు చేసే పందిళ్లకు ఉచిత విద్యుత్
అమరావతి: వినాయక చవితి పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది..వినాయక చవితి ఉత్సవ విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో పందిళ్లకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని పలువురు నిర్వాహకులు మంత్రి నారా లోకేష్‌కు విజ్ఞప్తి చేశారు..ఇదే విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో మంత్రి లోకేష్ మాట్లాడారు.. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంవత్సరం దాదాపు 15వేల గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు.. గణేష్ ఉత్సవ పందిళ్లకు ఉచిత విద్యుత్ అందించడానికి రూ.25 కోట్లు ఖర్చు అవుతుంది..
విజయదశమి కూడా:- ఆంద్రప్రదేశ్ లోని కోట్లాది మంది గణేష్ భక్తుల సౌలభ్యం దృష్ట్యా ఉచిత విద్యుత్ అందించేలా చూడాలని మంత్రి లోకేష్ వినతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు..ఈ మేరకు ప్రత్యేకంగా జీవో విడుదలకు ఆదేశాలు జారీ చేశారు.. అలాగే విజయదశమి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గాదేవి మండపాలకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.