మాజీ సీ.ఎం జగన్ కలిసిన మాజీ వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత,మాజీ సీ.ఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురువారం సమావేశం అయ్యారు..వరుస కేసులతో గత 5 నెలలుగా జైలులో ఉన్న వంశీకి కోర్డు బెయిల్ మంజూరు చేయడంతో బుధవారం జైలు నుంచి విడుదలయ్యారు..నేడు తమ అధినేత జగన్‌ను,, తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు.. వంశీ వెంట అయన భార్య పంకజశ్రీ వున్నారు..ఈ సందర్భంగా జైలు జీవితం,,తదితర పరిణామాలపై అధినేతతో వంశీ చర్చించినట్లు సమాచారం..గన్నవరంలొ టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఫిబ్రవరి 16వ తేదిన హైదరాబాద్‌లో వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు..ఆటు తరువాత ఆయనపై 11 కేసులు నమోదు అయ్యాయి..దాదాపు 140 రోజుల పాటు వంశీ విజయవాడ జిల్లా జైలులో వున్నారు.

