అటవీ అకాడమీ శిక్షణ కేంద్రం శాశ్వత భవనం-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అమరావతి: రాష్ట్రంలో 23 శాతం భూ భాగం పచ్చదనంతో కలిగి ఉండేలా చర్యలు తీసుకోవడంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో అటవీ ప్రాంతాల అభివృద్ధి దిశగా అడుగులు వేయడం జరుగుతోందనీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గురువారం స్థానిక దివాన్ చెరువు అటవీ శాఖ శిక్షణా కేంద్రంలో శిక్షణ కేంద్రం శాశ్వత భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో అటవీ అకాడమీ శిక్షణ కేంద్రం శాశ్వత భవనానికి రూ.18 కోట్లతో శంకుస్థాపన చెయ్యడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తు తరాల కోసం పచ్చదనం కలిగిన ప్రాంతాల్ని అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు తెలిపారు. రాష్ట్రములో పచ్చదనాన్ని 23 శాతం వరకు పెంచాలనే సంకల్పంతో క్యాబినెట్‌లో ప్రత్యేకంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందనీ, అందులో భాగంగా తొలిదశలో అందులో 50 శాతం మేరకు లక్ష్యాలను సాధించేందుకు పకడ్బందీ కార్యాచరణ సిద్ధం చెయ్యడం జరిగిందన్నారు.

