AP&TG

ఐదుగురు IAS అధికారులకు ప్రభుత్వ కార్యదర్శులుగా ‌పదోన్నతి

అమరావతి: 2010 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు IAS అధికారులను సూపర్ టైమ్ స్కేల్‌ (పే మ్యాట్రిక్స్ లెవల్–14)కు, క్యాడర్‌కు సమానంగా, 2026 జనవరి 1 నుండి అమలులోకి వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ప్రభుత్వ కార్యదర్శులు గా పదోన్నతి పొందిన అధికారులలో చదలవాడ నాగరాణి, డా.నారాయణ భరత్ గుప్తా, అమ్రపాలి కటా, జె.నివాస్, గంధం చంద్రుడు ఉన్నారు. పదోన్నతుల అనంతరం డా.నారాయణ భరత్ గుప్తాను అదే పదవిలో కొనసాగిస్తూ కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్, RUSA స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా కొనసాగిస్తున్నారు. అమ్రపాలి కటా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు. గంధం చంద్రుడిని కార్మిక శాఖ కమిషనర్‌గా నియమిస్తూ, పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నఎం.వి.శేషగిరి బాబును రిలీవ్ చేశారు. చదలవాడ నాగరాణి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్,  జిల్లా మేజిస్ట్రేట్‌గా అదే పదవిలో కొనసాగనున్నారు. అవసరమైన చోట్ల పోస్టుల సృష్టి, అప్‌గ్రేడేషన్, క్యాడర్ సమానత్వానికి సంబంధించిన ఉత్తర్వులు వేరుగా జారీ చేస్తామని ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *