AP&TG

స్త్రీ శక్తి పథకంతో మహిళలకు ఆర్థిక భరోసా,భద్రత- సీ.ఎం,డి..సీ.ఎం

అమరావతి: ‘విద్యార్థినులకు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో నెలకు రూ.1500 నుంచి రూ.2 వేల మేర పొదుపు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నమని,, ఉచిత బస్సు ప్రయాణం అంటే కేవలం రవాణా మాత్రమే కాదు.. వారి భద్రతకు తగిన విధంగా భరోసా ఇచ్చే గొప్ప పథకం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.. సూపర్ సిక్స్ హామీలో కీలకమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అయిన స్త్రీ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ శుక్రవారం ప్రారంభించారు. ఉండవల్లి నుంచి విజయవాడ వరకూ మహిళలతో కలసి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ లు ప్రయాణించారు. విజయవాడ బస్టాండ్ వద్ద నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకొస్తూనే మరోవైపు ఇచ్చిన హామీల అమలు, అభివృద్ధి వైపు నడకను మొదలుపెట్టాం. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయి. అమరావతి నిర్మాణానికి, విశాఖ స్టీల్ ప్లాంటు ఆర్థిక పుష్టికి కేంద్ర సర్కారు తగిన విధంగా తోడ్పాటునందిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మరింత సుందరంగా మారబోతుంది. ప్రజలు మాపై పెట్టుకున్న భరోసాను వందశాతం నెరవేరుస్తాం’’ అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *