AP&TG

2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్

రూ.3,32,205 కోట్లు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శనివారం శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్ గురించి వివరిస్తూ, తమ దృష్టిలో బడ్జెట్‌ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదని రాష్ట్రాభివృద్ధి,, ప్రజా సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకుని వెళ్లే సంకల్పంతో బడ్జెట్ లో కేటాయింపులు చేయడం జరిగిందన్నారు.

మొత్తం బడ్జెట్‌: రూ.3,32,205 కోట్లురెవెన్యూ వ్యయం: రూ.2,56,143 కోట్లు….మూలధన వ్యయం: రూ.53,915 కోట్లురెవెన్యూ లోటు: రూ.22,002 కోట్లు….ద్రవ్య లోటు: రూ.75,868 కోట్లుగా వున్నాయి.

బడ్జెట్‌ పద్దులు:2026-27 రాష్ట్ర బడ్జెట్‌లో వివిధ సంక్షేమ పథకాలు, వివిధ కార్యక్రమాలకు నిధులు కేటాయించారు. ఎన్టీఆర్ భరోసా పథకానికి రూ.27,719 కోట్లు, దీపం 2.0 – రూ.2,601 కోట్లు, వివిధ వర్గాలకు ఆర్ధిక మద్దతుకి రూ.2,320 కోట్లు, స్త్రీశక్తి రూ.1,420 కోట్లు, వీకర్ సెక్షన్లకు సబ్సిడీ, ఉచిత విద్యుత్ – రూ.600 కోట్లు, ఆటో డ్రైవర్ల సేవలో రూ.450 కోట్లు, తల్లికి వందనం రూ.9,668 కోట్లు, స్త్రీ, శిశు సంక్షేమం రూ.4,581 కోట్లు, ఉపకారవేతనాలు రూ.3,836 కోట్లు, రూ.సమగ్ర శిక్ష 2,946 కోట్లు, రూ.ఉన్నత విద్య 2,566 కోట్లు కేటాయించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి రూ.2,161 కోట్లు, మన బడి, మన భవిష్యత్ రూ.1,500 కోట్లు, నైపుణ్యాభివృద్ధి రూ.1,232 కోట్లు, పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా రూ.707 కోట్లు, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్ధి మిత్ర రూ.654 కోట్లు, యువత, క్రీడలకు రూ.438 కోట్లు, వీబీజీ రామ్‌జీకి రూ.8,365 కోట్లు, గృహ నిర్మాణం రూ.5,451 కోట్లు, ఎన్టీఆర్‌ వైద్య సేవ రూ.4,000 కోట్లు, జల్‌జీవన్‌ మిషన్‌ రూ.4,000 కోట్లు, స్వచ్ఛభారత్‌ మిషన్‌ రూ.1,037 కోట్లు, ఆయుష్మాన్‌ భారత్‌ రూ.838 కోట్లు కేటాయించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *