AGRICULTUREAP&TGOTHERS

రైతులు ప్రకృతి వ్యవసాయం పై మొగ్గు చూపాలి-కలెక్టర్ వెంకటేశ్వర్

సాంకేతిక పరిజ్ఞానం..

తిరుపతి: సమగ్ర వ్యవసాయం కార్యక్రమంలో, రైతులు విత్తనం వేయడం నుండి కోత దాకా సంప్రదాయ పద్ధతులకే పరిమితం కాకుండా సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOలు), రైతు సంఘాలు ద్వారా సమిష్టిగా వ్యవసాయం చేస్తే ఆదాయం పెరగడంతో పాటు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయని తెలిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కిసాన్ మేళా 10–15 మంది రైతులు కలసి సాగు, కొనుగోలు, మార్కెటింగ్ నిర్వహిస్తే లాభదాయకత పెరుగుతుందని సూచించారు.బుధవారం ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ANGRAU) తిరుపతి, ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మేళా-సమగ్ర వ్యవసాయం కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి శ్రీమతి డా శారద జయలక్ష్మి దేవ, వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలసి కలెక్టర్ పాల్గొని వ్యవసాయ-అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు.

శాస్త్రీయ పద్ధతులు:- రైతులు ఇతరులు ఏమి పండిస్తున్నారో అనుసరించడం కాకుండా వ్యవసాయ అధికారులను, శాస్త్రవేత్తలను సంప్రదించి శాస్త్రీయ పద్ధతులను అవలంబించాలి అని సూచించారు. గతంలో అనుభవించిన పంట నష్టాల ఉదాహరణలను ప్రస్తావిస్తూ, సరైన సలహాలు తీసుకోకపోతే ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రభుత్వం మరియు అధికారులు గ్రామాలకే చేరుకుని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *