సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు-ప్రత్యేక చట్టం-హోం మంత్రి అనిత
శ్రీకాంత్ పెరోల్ రద్దు..
అమరావతి: సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించి అభద్రతా భావానికి గురిచేసే వారిపై ఇకపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుందని దీనిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకురానున్నట్టు రాష్ట్ర హోం,విపత్తుల నిర్వహణ శాఖామంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.మంగళవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పధకాలను చూసి ఓర్వలేక సోషల్ మీడియాలో విషం చిమ్ముతూ వాస్తవాలను అవాస్తవాలుగా చిత్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించడమే గాక అభధ్రతా భావానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు.అమరావతిపై లేనిపోని రాతలు రాసేవారిపై, తప్పుడు పోస్టులు పెట్టవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సియం స్పష్టం చేశారని మంత్రి అనిత పునరుద్ఘాటించారు.
శ్రీకాంత్ అనే వ్యక్తి పెరోల్ రద్దు చేశాం:- పెరోల్ రావడం వెనుక ఏముంది ఎవరున్నారనే దానిపై పూర్తిగా విచారణ జరుపుతున్నామని ఈసంఘటనలో ఎవరున్నా వారిపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.శ్రీకాంత్ విషయంలో ఎస్కార్ట్ సిబ్బందిపై కూడా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తికి పెరోల్ వచ్చిందని జైలు అధికారి చెప్పారని వెంటనే అతని పెరోల్ రద్దు చేసి తిరిగి జైలుకు పంపామని అన్నారు.ఈఘటనలో పోలీస్ అధికారులు ఎవరున్నా వారిపై కూడా విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.అరుణ అనే మహిళ దిశా ఫౌండేషన్ కు సెల్ప్ డిక్లేర్డ్ సెక్రటరీ అని ఆమె నుంచి హోంశాఖ పేషీకి ఫోన్ వచ్చిందని దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నామని ఆమె గురించి ఆమె వెనుకున్న వారి గురించి ఆరా తీస్తున్నాని తెలిపారు.