AP&TG

శుక్ర,శనివారాల్లో రాష్ట్రంలో “తీవ్ర వడగాల్పులు” విపత్తుల నిర్వహణ సంస్థ

అమరావతి: రాష్ట్రంలో భానుడి ప్రతాపం మొదలైంది. రోజు రోజుకు ఎండల తీవ్రత పెరుగుతు వస్తొంది. ఈ నేపధ్యంలో శుక్రవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పార్వతీపురంమన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాలు, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, కాకినాడ జిల్లా జగ్గంపేట, తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ , ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *