కడప జిల్లాలో ఛార్జింగ్ పెట్టగా పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్-మహిళ మృతి
అమరావతి: కడప జిల్లా, యర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో ఇంట్లో ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ పేలింది..ఈ సంఘటనలో అక్కడే నిద్రిస్తున్న వెంకట లక్ష్మమ్మ (62) తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు..వెంకట లక్ష్మమ్మ ఇంటి ప్రాంగణంలో తన కుటుంబం కోసం కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ గురువారం రాత్రి ఛార్జింగ్ కోసం ఉంచారు..వేకువజామున వాహనం పేలడంతో సమీపంలో ఉన్న ఆమెకు మంటలు వ్యాపించాయి..సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలంకు చేరుకుని,,పోస్టు మార్టం కోసం అమె మృతుదేహంను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..వాహనం పేలుడుకు గల కారణాలను అన్వేషించేందుకు ఫోరెన్సిక్ టీంను రప్పించారు.. వాహనం తయారీ సంస్థకు కూడా సమాచారం పంపినట్లు తెలిపారు..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.