దేశీయంగా సిద్దమైన CSR-338 స్నైపర్ రైఫిల్స్
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఆధునిక చిన్న ఆయుధాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించిందని ఐకామ్ డైరెక్టర్ సుమంత్ పాతూరు తెలిపారు.ఇక్కడే CSR-338 స్నైపర్ రైఫిల్స్ ఉత్పత్తి చేసి 200 రైఫిల్స్ CRPFకు అందజేయనున్నమని వెల్లడించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఎడ్జ్ గ్రూప్ సంస్థ కారకాల్ ఇంటర్నేషనల్‌తో ఐకామ్ సంస్థ సైనిక దళాలకు, భద్రతా సిబ్బందికి అవసరమయ్యే చిన్నపాటి ఆయుధాలను తయారు చేసే సాంకేతికతను పొందేందుకు ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. CRPFకు సరఫరా చేయడమే కాదు, ప్రపంచ స్థాయి సాంకేతికతను బదిలీ చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో నైపుణ్యంతో కూడిన ఉద్యోగాలను సృష్టిస్తూ, భారత రక్షణ పారిశ్రామిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నమని తెలిపారు. భవిష్యత్ అవసరాలు, ఎగుమతి మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించడానికి కట్టుబడి ఉన్నాం అని అన్నారు.
CSR-338 స్నైపర్ రైఫిల్స్ లాపువా మాగ్నమ్ కాలిబర్‌తో, హై-పర్ఫార్మెన్స్ బోల్ట్-యాక్షన్ కలిగి ఉంటాయి. వీటిలో 27 అంగుళాల బ్యారెల్, 10 రౌండ్ల మ్యాగజైన్, ఇరువైపులా ఉపయోగించగలిగే మ్యాగజైన్ రిలీజ్ & సేఫ్టీ మెకానిజం, రెండు దశల అడ్జస్టబుల్ ప్రిసిషన్ ట్రిగ్గర్, నాలుగు స్థాయిలలో సర్దుబాటు చేసుకునే టెలిస్కోప్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.