AP&TG

మాట నిలుపుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పిన మాటన నిలుపుకున్నాడు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లి ఆమెను ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఆనందంతో ముసిరిపోయిన నాగేశ్వరమ్మ, పవన్ కల్యాణ్ ఐదుసార్లు ముఖ్యమంత్రి అవ్వాలని ఆకాంక్షించారు.వృద్ధురాలి కోరిక వినగానే పవన్ కల్యాణ్‌తోపాటు అక్కడ ఉన్నవారంతా నవ్వేశారు.

రోడ్ల విస్తరణ పేరుతో:- 2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్ల విస్తరణ పేరుతో ఇప్పటం గ్రామంలో స్థానికుల ఇళ్లను అలాగే జనసేన కార్యకర్తల ఇళ్లను కూడా అధికారులు కూల్చివేశారు. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారనే కక్షతో జనసేన కార్యకర్తలు లక్ష్యంగా ఈ పని చేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇప్పటంలో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. ఎన్నికల్లో గెలిచాక మళ్లీ తమను కలిసేందుకు రావాలని ఇండ్ల నాగేశ్వరమ్మ పవన్ కల్యాణ్‌ను ఆ సమయంలో కోరింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఇచ్చిన మాట కోసం ఇవాళ ఇప్పటంలోని నాగేశ్వరమ్మ ఇంటికి పవన్ వెళ్లారు.

ఆర్ధిక సాయం:- పవన్ కల్యాణ్ రావడంతో ఆయనకు నాగేశ్వరమ్మ ఆప్యాయంగా స్వాగతం పలికారు. పవన్ కల్యాణ్ కూడా ఆమెను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె అవసరాల కోసం రూ.50 వేలు, ఆమె మనువడి చదువు కోసం రూ.లక్ష ఆర్థికసాయం అందించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *