మామండూరు అటవీ క్షేత్రన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి
తిరుపతి: శనివారం తిరుపతి జిల్లాలోని మామండూరు అటవీ క్షేత్రాన్నిజిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్-ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు.ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి అటవీ ప్రాంతంలోని సహజ సౌందర్యాన్ని ఆస్వాదించారు. అడవిలో నాలుగు కిలోమీటర్లు పైగా ప్రయాణం. రెండు కిలోమీటర్ల మేర కాలినడకన ప్రతి చెట్టునీ పరిశీలించిన ఉపముఖ్యమంత్రి అక్కడి వాటర్‌ఫాల్స్ ను, పచ్చని చెట్లను,అటవీ జీవవైవిధ్యాన్ని పరిశీలించారు. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనబడే అరుదైన మొక్కలు పరిశీలించి అటవీ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న డిప్యూటీ సీఎం అటవీ శాఖ ఏర్పాటు చేసిన టవర్‌పైకి ఎక్కి చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు.

వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణ ముఖీ నది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? తదితర వివరాలు అలాగే ఎర్రచందనం స్మగ్లింగ్, స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్, టాస్క్ ఫోర్స్, అటవీ సిబ్బంది కూంబింగ్ తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్, కలెక్టర్,ఎస్పీతో కలిసి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటారు.ఈ సందర్శన ద్వారా పచ్చదనం, పర్యావరణ సంరక్షణ ప్రాధాన్యతను తెలియజేశారు.మామండూరు పర్యటన అనంతరం మంగళం పరిధిలోని ఉన్న ఎర్రచందనం గోడౌన్ ను క్షుణ్ణంగా పరిశీలించి స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

