సోమవారం నాటికి “మొంథా” తుపానుగా మారనున్న వాయుగుండం
రాష్ట్రానికి రెడ్ అలెర్ట్..
అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారనున్నది. తీవ్ర వాయుగుండం సోమవారం ఉదయానికి “మొంథా” తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు..దింతో రాష్ట్రంకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. 29వ తేది (బుధవారం) వరకు తుపాను ప్రభావం చూపిస్తుందని అధికారులు వెల్లడించారు. తుపాను వాయవ్య దిశలో కదిలి ఈ నెల 28వ తేది సాయంత్రం మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని,,తుపాను మంగళవారం రాత్రి తీరం దాటే సమయంలో గంటలకు 90 నుంచి 110 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని స్పష్టం చేశారు.
విద్యా సంస్థలకు 28,29 తేదీల్లో సెలవు:- విశాఖపట్నం నుంచి తిరుపతి వరకూ తుపాను ప్రభావం ఉండనుందని తెలిపారు.రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న విద్యా సంస్థలకు 28,29 తేదీల్లో సెలవు ప్రకటించాలని వాతావరణ శాఖ అధికారులు ప్రభుత్వానికి సూచించారు. భారీ వర్షాలు పడే అవకాశమున్నందున విజయవాడ, ఏలూరు, దివిసీమ, మచిలీపట్నం, గుంటూరు , గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

