మొంథా తుఫాన్ – పోర్టుల్లో 10,9,8 ప్రమాద హెచ్చరికలు!
తుఫాన్ సిగ్నల్స్ తీవ్రతలు…
అమరావతి: కాకినాడ పోర్టులో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ.విశాఖ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నంలో 9వ ప్రమాద హెచ్చరిక జారీ. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవులకు 8వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు.
తుఫాన్ తీవ్రతను అంచనా వేయడం:– తుఫాను తీవ్రతను గరిష్ట గాలి వేగం ఆధారంగా వర్గీకరిస్తారు..ఉదాహరణకు.. “సైక్లోనిక్ తుఫాను” 34-47 నాట్ల లేదా గంటలకు 62-88 కిమీ వేగంతో గాలులు వీస్తుంది..
“తీవ్రమైన తుఫాను తుఫాను” 48-63 నాట్ల లేదాగంటకు 89-117 కిమీ వేగంతో గాలులు వీస్తుంది..
సిగ్నల్ సంఖ్య పెరిగే కొద్ది తీవ్రమైన పరిస్థితులను సూచిస్తాయి..ఉదాహరణకు… సిగ్నల్ 3 లేదా 4 ఒక పోర్టులో క్లీష్టమైన వాతావరణాన్ని సూచిస్తాయి.. అయితే సిగ్నల్స్ 5, 6 లేదా 7 ప్రమాదాన్ని సూచిస్తాయి..సిగ్నల్స్ 8 లేదా 9 “చాలా ప్రమాదకరమైన” పరిస్థితిని హెచ్చరిస్తాయి.
10వ సంఖ్య హెచ్చరిక:–కొన్నిసార్లు “గ్రేట్ డేంజర్ సిగ్నల్ నం 10” అని పిలుస్తారు..తీవ్రమైన తుఫాను ఓడరేవును దాటుతుందని లేదా దానికి చాలా దగ్గరగా ఉంటుందని హెచ్చిరిస్తారు.. అన్ని రకాల జాగ్రత్తల కోసం అత్యవసర సంకేతంగా భావించాల్సి వుంటుంది.

