పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించిన సి డబ్ల్యూ సి బృందం
అమరావతి: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాన్ని శనివారం కేంద్ర జలసంఘం సభ్యుడు యోగేష్ పైథాంకర్ చీఫ్ ఇంజనీర్ హెచ్ ఎస్ సెనేగర్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చీఫ్ ఇంజనీర్ రమేష్ కుమార్లతో కూడిన బృందం ప్రాజెక్ట్ ను సందర్శించింది..పోలవరం ప్రాజెక్ట్ లో జరుగుతున్న డయాఫ్రమ్ వాల్, బాట్రస్ డామ్, గ్యాప్ 1 పనులు, ఎగువ, దిగువ కాఫర్ డామ్,స్పిల్ వే లను బృందం పరిశీలించింది..

బట్రస్ డామ్, డయాఫ్రమ్ వాల్ నిర్మాణ తీరు గురించి జలవనరుల శాఖ అధికారులు,కేంద్ర బృందానికి వివరించారు. నిర్దేశిత లక్ష్యం మేరకు ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరిగేలా చూడాలని అధికారులను వారు కోరారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనులు చేస్తున్నాయని జలవరుల శాఖ అధికారులు వివరించారు.

