AP&TGMOVIESOTHERS

దుల్క‌ర్ స‌ల్మాన్,,పృథ్వీరాజ్ సుకుమార‌న్ ఇళ్ల‌ల్లో క‌స్ట‌మ్స్ అధికారులు అక‌స్మిక తనిఖీలు

అమరావతి: భూటాన్‌ లో ఇటీవల కొన్ని ఖరీదైన వాహనాలను వేలం వేస్తే వాటిని తక్కువ ధరకు కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఎలాంటి కస్టమ్స్‌ డ్యూటీ చెల్లించకుండా ఇండియాకు స్మగ్లింగ్‌ చేసినట్లు అధికారులకు సమాచారం అందింది..ఈ ఖరీదైన కార్లను ఇండియాలోని సినిమా, బిజినెస్ ప్రముఖులకు అమ్మకాలు జరిపారన్న సమాచారం రావడంతో దేశ వ్యాప్తంగా దాదాపు 30 చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేసారు. ఇందులో బాగంగా మ‌ల‌యాళ స్టార్ న‌టులైన దుల్క‌ర్ స‌ల్మాన్,,పృథ్వీరాజ్ సుకుమార‌న్ ఇళ్ల‌ల్లో క‌స్ట‌మ్స్ అధికారులు అక‌స్మిక దాడులు చేశారు. లగ్జరీ కార్ల అక్రమ రవాణా (స్మగ్లింగ్) ఆరోపణలకు సంబంధించిన కేసులో భాగంగా ఈ దాడులు జరిగాయి. దేశవ్యాప్తంగా లగ్జరీ కార్ల స్మగ్లింగ్‌పై కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగానే కేరళలోని పలువురు ప్రముఖుల నివాసాల్లో సోదాలు జరిగాయి. కోచి, తిరువనంతపురంలో ఉన్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లతో పాటు పనంపిల్లి నగర్‌లోని దుల్కర్ సల్మాన్ నివాసంలోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు. వారి వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ల‌గ్జ‌రీ వాహనాలు లభించలేదని క‌స్ట‌మ్స్ అధికారులు తెలిపిన‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు ఈ ఇద్దరు నటుల ఇళ్లలో మాత్రమే కాకుండా కేరళ వ్యాప్తంగా కోచి, కొజికోడ్, మలప్పురం సహా వివిధ ప్రాంతాల్లో కస్టమ్స్ అధికారులు దాడులు నిర్వహించిన‌ట్లు స‌మాచారం. ఈ సోదాల ద్వారా కొన్నేళ్లుగా జరుగుతున్న లగ్జరీ కార్ల అక్రమ రవాణాపై అధికారులు మరింత లోతుగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇంకా పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *