ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో “సృష్టి” అనైతిక పనులు
పోలీసుల విచారణలో దారుణాలు..
అమరావతి: సరోగసీ ముసుగులో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ చేసిన దారుణాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.. సికింద్రాబాద్ తో పాటు విశాఖపట్టణ, విజయవాడలో “సృష్టి” అనైతిక పనులకు పాల్పపడినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూస్తోంది..
రాజస్థాన్‌కు చెందిన సోనియా దంపతులు 2024లో సృష్టి సెంటర్ ను సంప్రదించి ఒక చిన్నారికి జన్మించారు..ఈ చిన్నారికి క్యాన్సర్ రావడంతో తల్లిదండ్రులకు అనుమానం కలిగింది.. పుట్టిన బిడ్డ తమ వీర్య కణాలతోనే జన్మించదా ? లేదా అనే అనుమానంతో DNA పరీక్ష చేయించగా, అసలు నిజం వెలుగులోకి వచ్చింది..దిందో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు..రంగంలోకి దిగిన పోలీసులు ఈనెల 25న సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను సికింద్రాబాద్, గోపాలపురం పోలీసులు అరెస్టు చేసి వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు..
రూ.30 లక్షలు డిమాండ్:- సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై నమోదైన FIR కాపీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. రాజస్థాన్‌కు చెందిన సోనియా దంపతులు ఆగస్టు 2024న డాక్టర్ నమ్రతాను కలిశారు.. తమకు సంతానం కావాలని, IVF ప్రొసీజర్ ద్వారా సంతానం కలిగేలా చేయాలని కోరారు.. దీంతో డాక్టర్ నమ్రతా IVF ప్రొసీజర్ కోసం వారి నుంచి రూ.30 లక్షలు డిమాండ్ చేసింది..ఇందుకు అంగీకరించిన దంపతులు 15 లక్షల రూపాయలు చెక్కు రూపంలో, మిగిలిన 15 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు.. ప్రొసీజర్ లో భాగంగా విశాఖపట్టణంలో మరో బ్రాంచ్‌కు శాంపిల్ కలెక్షన్ కోసం ఆ దంపతులను పంపించారు.. కేవలం మెడికల్ టెస్టుల కోసం రూ.66 వేలు తీసుకున్నట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.. పలుసార్లు విశాఖ సెంటర్ కు పంపించినట్లు బాధితులు పేర్కొన్నారు.
విజయవాడలోని బెంజ్ సర్కిల్:- విశాఖలోని సృష్టి టెస్టు ట్యూబ్ బేబీ సెంటర్ ద్వారా గతంలో అనేక దారుణాలకు నిర్వాహకులు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది.. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పేద మహిళలను టార్గెట్ చేసి అద్దె గర్భంతో ఆస్పత్రి నిర్వాహకురాలు లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది.. గతంలోనే ఈ ఆస్పత్రిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి..విజయవాడలోని బెంజ్ సర్కిల్ సమీపంలో వున్న యూనివర్శల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ నుంచి 2015 నుంచి వీరి ఈ వ్యాపారం కొనసాగుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది..ఈ ఆస్పత్రిపై రెండు సార్లు పోలీసు కేసులు నమోదు కాగా పలు సందర్భాల్లో లైసెన్సును సైతం రద్దు చేశారు..దింతో సృష్టి సంస్థ నిర్వహకులు, డాక్టర్ కరుణ పేరుపై ఈ సెంటర్ నడుస్తున్నట్లు గుర్తించిన పోలీసులు,,ఆమెకోసం గాలిస్తున్నారు. సంతానం లేమి దంపతులకు సరోగసీ ద్వారా తక్కు ధరకే సంతాన ప్రాప్తి కల్పిస్తామని కృష్ణా, గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో డాక్టర్ నమ్రతా గతంలో స్వయంగా ప్రచారం చేసినట్లు తెలుస్తొంది..

