AP&TGCRIME

సినిమాలను పైరసీ చేస్తున్న దేశంలోని అతిపెద్ద గ్యాంగ్ అరెస్ట్-కమీషనర్ సీవీ ఆనంద్‌

సినీ పరిశ్రమకు 3700 కోట్ల మేర నష్టం..

హైదరాబాద్: సినిమాలను పైరసీ చేస్తున్న దేశంలోనే అతిపెద్ద గ్యాంగ్ ను జంట నగరాల సైబర్‌ క్రేమ్‌ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందని హైదరాబాద్‌ పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్‌ తెలిపారు.సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ రెండు రకాలుగా సినిమా పైరసీ జరుగుతుందని,అందులో ఒకటి థియేటర్‌కు వెళ్లి కెమెరా ద్వారా రికార్డింగ్‌ చేసి పైరసీకి పాల్పపడడం,,రెండవది డిజిటల్‌ శాటిలైట్‌ను హ్యాక్‌ చేసి పైరసీ చేయడం అని తెలిపారు. పైరసీ సినిమాలు అప్‌లోడ్‌ చేసి బెట్టింగ్‌, గేమింగ్‌ యాప్‌ ప్రకటనల ద్వారా ఆదాయం పొందుతున్నారని వెల్లడించారు.

ప్రధాన నిందితుడు-తమిళనాడు-సిరిల్‌:- సింగిల్‌, హిట్‌ 3 సినిమాల పైరసీ జరిగినప్పుడు తమకు ఫిర్యాదులు అందాయని సీ.పీ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు తమిళనాడులోని కరూర్‌కు చెందిన సిరిల్‌ అని చెప్పారు. 2020 నుంచి అతను నాలుగు పైరసీ websitesను run చేస్తున్నడని తెలిపారుకంప్యూటర్‌ సైన్స్‌ చదివిన సిరిల్‌,ఈజీ మానీ కోసం ఈ మార్గాన్ని ఎంచుకున్నాడన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకుని అన్ని భాషల సినిమాలను పైరసీ చేస్తున్నాడని తెలిపారు.

హైదరాబాద్‌-జానా.కిరణ్‌కుమార్‌ రెడ్డి:- జానా కిరణ్‌కుమార్‌ రెడ్డి,, హైదరాబాద్, అత్తాపూర్‌లో ఉన్న మంత్ర మాల్‌ లో వున్న థియేటర్‌కు వెళ్లి, హైఎండ్‌ కెమెరా ఉన్న సెల్‌ఫోన్‌ ద్వారా రికార్డింగ్‌ చేసి టెలిగ్రామ్‌ ఛానల్‌ ద్వారా మరొకరికి పంపించే వాడని వెల్లడించారు. సినిమాను రికార్డు చేసేందుకు నిందితులు సెల్‌ఫోన్లను జేబులో కానీ, పాప్‌కార్న్‌ డబ్బాలో కానీ పెడతారని అన్నారు. ప్రత్యేక యాప్‌ ఉపయోగించి సినిమాలను ఈ ముఠా పైరసీ చేసిందన్నారు. ఈ యాప్‌ తో రికార్డింగ్‌ చేస్తున్నప్పుడు సెల్‌ఫోన్‌ స్క్రీన్‌లైట్‌ కూడా ఆఫ్‌లో ఉంటుందని అన్నారు. దీంతో ఎవరికీ ఏ అనుమానం రాదన్నారు.

22 సీసీటీవీ కెమెరాలు:- బిహార్‌లోని పట్నాకు చెందిన అశ్విన్‌ కుమార్‌ అనే 22 ఏళ్ల యువకుడు ఈ కేసులో మరో నిందితుడు అని చెప్పారు. డిజిటల్‌ మీడియా సర్వర్లను హ్యాక్‌ చేసి సినిమాలను అప్‌లోడ్‌ చేస్తున్నాడని తెలిపారు. ఇతను దాదాపు 1000 సినిమాలను నేరుగా సర్వర్లను హ్యాక్‌ చేసి అప్‌లోడ్‌ చేసినట్లు తెలిపారు.ఇతను కేవలం సినిమాలకు సంబంధించిన సర్వర్లు మాత్రమే కాకుండా ప్రభుత్వ విభాగాల వెబ్‌సైట్లు, ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌ను కూడా హ్యాక్‌ చేయగలిగే సామర్థ్యం వుందన్నారు. బిహార్‌లో అతన్ని అరెస్ట్ చేసేందుకు ఇంటికి తమ టీమ్‌ వెళ్లిందని,,అతని ఇంటి వద్ద సెక్యూరీ అరెంజ్ మెంట్స్ చూసి,పోలీసులే అశ్చర్యపోయారన్నారు..తనకు పరిచయం లేని వ్యక్తులు తన ఇంటికి వస్తే గుర్తించేందుకు అశ్విన్‌ కుమార్‌ 22 సీసీటీవీ కెమెరాలు ఉపయోగిస్తున్నాడని చెప్పారు.

నెలకు రూ.9 లక్షలు:- ఈ సినిమాల పైరసీని ప్రధానంగా ప్రోత్సహిస్తున్నది బెట్టింగ్‌, గేమింగ్‌ యాప్‌ నిర్వాహకులే అని కమీషనర్ తెలిపారు. పైరసీ సైట్లలోని లింక్‌లను క్లిక్‌ చేస్తే యూజర్‌ వివరాలన్నీ పైరసీ ముఠాకు వెళ్తాయన్నారు. ఎక్కువ సినిమాల పైరసీని కిరణ్‌, అశ్వనీకుమార్‌ గ్యాంగ్ వల్లే జరిగాయని తెలిపారు. ఈ సినిమాలను పైరసీ చేసేందుకు సిరిల్‌ అనే వ్యక్తి నెదర్లాండ్స్‌, ప్యారిస్‌కు చెందిన సర్వర్లు,,వాటి ఐపీ అడ్రస్‌లు వాడుతున్నారని సీవీ ఆనంద్‌ తెలిపారు. ఇతనికి బెట్టింగ్‌ యాప్‌ల నిర్వాహకులు నెలకు దాదాపు రూ.9 లక్షలు ఇస్తున్నారని తెలిపారు.

సినీ పరిశ్రమకు 3700 కోట్ల మేర నష్టం:- ఈ గ్యాంగ్ బిట్‌కాయిన్లు, క్రిప్టో కరెన్సీ రూపంలోనే డబ్బులు తీసుకుంటుందని వివరించారు. ఇప్పటి వరకు 500 సినిమాలు పైరసీ చేసినట్లు గుర్తించామన్నారు. సిరిల్‌ వద్ద 10 క్రిప్టో కరెన్సీ వాలెట్లు, మూడు బ్యాంకు ఖాతాలను గుర్తించామన్నారు. ఈ గ్యాంగ్ పైరసీ వల్ల తెలుగు సినీ పరిశ్రమకు దాదాపు రూ. 3700 కోట్ల మేర నష్టం వచ్చినట్లు ఒక అంచనా వుందన్నరు. ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి కంప్యూటర్లు, హార్డ్‌ డిస్కులు, ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్‌ కనెక్టివిటీ టూల్స్‌ తోపాటు ఇతర సాంకేతిక పరికరాలను స్వాధీనం.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *