రాష్ట్రంలో 1.30 లక్షల ప్రాంతాల్లో యోగా నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు
అమరావతి: యోగాలో 2 కోట్ల మంది రిజిస్ట్రేషన్ జరగాలనేది లక్ష్యంతో పనిచేస్తున్నమని,, లక్ష్యానికి మించి 2.39 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారని,,శనివారం రాష్ట్రంలో 1.30 లక్షల ప్రాంతాల్లో యోగా నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు..యోగాంధ్రపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీ.ఎం మాట్లాడుతూ యోగా మన జీవితంలో భాగం కావాలని అకాంక్షించారు..రాష్ట్రంలో “యోగా దినోత్సవం” ఘనంగా నిర్వహించుకోవాలన్నారు..రాష్ట్రమంతాట ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ శిక్షణ నిర్వహణ ఉండాలని,, 9వ తరగతి నుంచి విద్యార్థులు యోగా అభ్యసం చేసేందుకు భవిష్యత్తులో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ శిక్షణ, కోర్సులు కోర్సులు నిర్వహించనున్నామని వెల్లడించారు..
2.39 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు:- యోగా కార్యక్రమంలో 2 కోట్ల మంది రిజిస్ట్రేషన్ జరగాలనేది లక్ష్యం పెట్టుకున్నమని,, లక్ష్యానికి మించి 2.39 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నరని తెలిపారు..శనివారం రాష్ట్రంలో లక్ష 30 వేల ప్రాంతాల్లో యోగా నిర్వహణ ఉంటుందని,, దేశం వ్యాప్తంగా దాదాపు 7 లక్షల ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు చేస్తారని తెలిపారు.. ప్రపంచ వ్యాప్తంగా 8 లక్షల ప్రాంతాల్లో యోగా డేలో పాల్గొంటారని చంద్రబాబు వివరించారు..
22 వరల్డ్ బుక్ రికార్డులు:- విశాఖలో 3.5 లక్షల మంది మొబిలైజ్ చేసేలా ఏర్పాట్లు చేశామని,, రామకృష్ణాపురం బీచ్ నుంచి భోగాపురం వరకు కార్యక్రమాలు ఉంటాయన తెలిపారు..“యోగా ఫర్ వన్ ఎర్త్-వన్ హెల్త్” నినాదంతో ఈ సంవత్సరం కార్యక్రమం చేపట్టామన్నారు..3.50 లక్షల మందితో శుక్రవారం 108 నిమిషాలపాటు సూర్య నమస్కారాల కార్యక్రమం ఉంటుందని,, ఏజెన్సీ ప్రాంతాల నుంచి 25000 మంది విద్యార్థులు వస్తారని పేర్కొన్నారు..మొత్తం 22 వరల్డ్ బుక్ రికార్డుల కోసం కృషిచేస్తున్నామని,, ఉ.6.30 నుంచి ఉ.8 వరకు కార్యక్రమం ఉంటుందన్నారు..

