AP&TG

ఇంటిలో రెన్యూవెషన్ కోసం జీహెచ్ఎంసీపై హైకోర్టుకు వెళ్లిన చిరంజీవి

హైదాబాద్: మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ లో సొంత నివాసంను ఉమ్మ‌డి రాష్ట్రంలో 2000 సంవ‌త్స‌రంలో సీఎంగా ఉన్న‌ చంద్ర‌బాబును క‌లిసి,, ఇంటికి సంబంధించిన అనుమ‌తులు తీసుకుని G+2 ఇల్లు నిర్మించుకున్నారు..ఇంటిని నిర్మించి దాదాపు 15 సంవ‌త్స‌రాలు అయిన నేప‌థ్యంలో రిటైనింగ్ వాల్‌తో పాటు,, మ‌రికొన్ని నిర్మాణాల‌ను కూడా చేప‌ట్టాల‌ని భావించారు..

హైదరాబాద్ లో ప్రస్తుతం హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తూన్న నేప‌థ్యంలో అనుమ‌తులు తీసుకునేందుకు చిరంజీవి గ‌త నెల 5వ తేదిన GHMCకి,, స‌ద‌రు మార్పుల‌కు సంబంధించిన ప్లాన్ వివ‌రిస్తూ అనుమ‌తులు కోరారు.. ఈ మేర‌కు ఆయ‌న ద‌ర‌ఖాస్తు చేసుకుని,,దాదాపు నెల రోజులు గ‌డిచిపోయాయి..అయితే GHMC నుంచి అనుమ‌తులు మాత్రం రాలేదు..ఈ విషయంపై అధికారులకు ఫోన్లు చేసినా స్పందించ‌క పోవడంతో విధిలేని ప‌రిస్థితిలో చిరంజీవి హైకోర్టును ఆశ్ర‌యించారు..త‌న ఇంటిని రెనోవేష‌న్ చేసుకోవాల‌ని భావించాన‌ని,, తగిన వివరాలు సమర్పించిన GHMC అధికారులు త‌న‌కు అనుమ‌తులు ఇవ్వ‌డం లేద‌ని కోర్టుకు వివ‌రించారు..ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకుని,, చ‌ట్ట ప్ర‌కారం అనుమ‌తులు ఇప్పించాల‌ని అభ్య‌ర్థించారు..ఈ అభ్యర్దనపై  మంగ‌ళ‌వారం విచారించిన కోర్టు,, GHMC అధికారుల‌ వైఖరి పట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ,, అనుమ‌తులు ఇచ్చేందుకు ఎంత గ‌డువు కావాల‌ని ప్ర‌శ్నించింది.. అక్ర‌మ నిర్మాణాల‌కు అధికారులు ఒత్తాసు ప‌లుకుతున్నార‌న్న ఫిర్యాదులు వ‌స్తున్నాయ‌ని,, స‌క్ర‌మ నిర్మాణాల‌కు మాత్రం అనుమ‌తులు ఇవ్వ‌లేరా? అని నిల‌దీసింది..సాధ్య‌మైనంత త్వ‌ర‌గా చిరంజీవి ఇంటి రెనోవేష‌న్ ప‌నుల‌కు అనుమ‌తులు ఇవ్వాల‌ని ఆదేశించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *