AP&TGCRIME

సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో మళ్లీ ఫిర్యాదు చేసిన చిరంజీవి

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కొంత కాలంగా తనను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో తనపై అభ్యంతకర పోస్టులు పెట్టి తిడుతున్న కొన్ని X హ్యాండిల్ ప్రొఫైల్స్‌ పై ఫిర్యాదు చేశారు..ఇటీవల సిటీ సివిల్ కోర్టు చిరంజీవి వ్యక్తిత్వంకు,,పేరు,ఫోటోలు,వీడియోలు,గాత్రం,,ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించరాదని ఉత్తర్వులు ఇచ్చిన,, తనపై ఇంకా వల్గర్ కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు..వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పాటు ఫిర్యాదులో దయా చౌదరి “@chowdary_daya11”,అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలపై కూడా తగు చర్యలని తీసుకోవాలని కోరినట్లు సమాచారం..చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తొంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *