AP&TG

జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై క్యాబినెట్ సబ్ కమిటీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

అమరావతి: రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉప సంఘంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం సమీక్షించారు. కేబినెట్ సబ్ కమిటీతో నిర్వహించిన సమీక్ష సమావేశంకు డిప్యూటీ సిఎం పవన్  కళ్యాణ్,,సబ్ కమిటీలోని మంత్రులు అనగాని, నారాయణ, నాదెండ్ల, సత్యకుమార్, అనిత, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్థన్ రెడ్డిలు హాజరు అయ్యారు..

ప్రజల అవసరాలు, పాలనా సౌలభ్యం ప్రధాన అజెండాగా జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అంశంపై ప్రభుత్వం ఆలోచనలు, చర్చ జరిగింది..ఇందులో గత ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల విభజన కారణంగా పలు చోట్ల ప్రజలకు ఇబ్బందులు, పరిపాలనలోనూ సమస్యలపై చర్చించారు. జిల్లాల పునర్ విభజన, మార్పులు చేర్పులు, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ఈ ఏడాది జూలైలో 7 గురు మంత్రులతో ఉప సంఘంను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది..ఈ క్యాబినెట్ సబ్ కమిటీ పలుమార్లు సమావేశమై వివిధ వర్గాలు, ప్రజాసంఘాల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకుంది. ఈ రోజు జరిగిన సమావేశంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ఉన్న పరిమితులు,,పరిష్కారాలపై చర్చించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *