AP&TG

ముగిసిన క్యాబినెట్ సమావేశం-12 అంశాలకు అమోదం

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశం ముగిసింది.. 12 అంశాలపై చర్చించిన మంత్రివర్గం ఆమోదం తెలిపింది..ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం….ఈ నెల 25 నుండి కొత్త రేషన్ కార్డులు పంపిణీకి  క్యాబినెట్ ఆమోదం….నూతన బార్ పాలసీకి ఆమోదం…నాయి బ్రాహ్మణలకు  150 యూనిట్ల నుండి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కు ఆమోదం….ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ టెక్ హబ్ పాలసీ 4.0కి ఆమోదం…ఏపీ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలోని 22 ఏపీటీడీసీ హాస్టళ్లను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించేందుకు అనుమతి…తిరుపతి రూరల్ మండలంలోని పేరూరు గ్రామంలో ఓబరాయ్ హోటల్ నిర్మాణానికి కేటాయించిన 25 ఎకరాల టీటీడీ భూ బదలాయింపు రద్దుకు నిర్ణయం….పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ కు ఎస్బీఐ, యూబీఐ బ్యాంకులకు రూ.900 కోట్లు గ్యారెంటీ ఇస్తూ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్….ఏపీఐఐసీకి రూ. 7500 కోట్ల రుణం తీసుకునేందుకు క్యాబినెట్ ఆమోదం…5 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు అనుమతి ఇస్తూ మంత్రివర్గం నిర్ణయం…మావోయిస్ట్ పార్టీ, ఆర్ డీ ఎఫ్ పార్టీ కార్యకలాపాలపై మరో ఏడాది పాటు నిషేధం.

నెలలోపు అక్రిడేషన్ కార్డులు:- ప్రస్తుత AP మీడియా అక్రిడిటేషన్ నిబంధనలు, 2023లో G.O Ms No.38, G. A. (I&PR) Dept., dt.30.03.2023ను రద్దుపరచి, దాని స్థానంలో కొత్తగా రూపొందింఛిన “కాంప్రహెన్సివ్ A.P మీడియా అక్రిడిటేషన్ రూల్స్, 2025” ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. గతంలో ప్రభుత్వంలో యూనియన్ల ప్రాతినిధ్యం లేకుండా అక్రిడేషన్ కమిటీ నిర్వహించారు. యూనియన్లు ప్రాతినిధ్యం కల్పిస్తూ జీవో విడుదల చేయడం జరిగింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *