పునర్విభజనలో 28 జిల్లాకే పరిమితం-కేబినెట్ అమోదం-మంత్రి అనగాని
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేశారు. దాదాపు 24 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్ మీడియాకు వెల్లడించారు.
9 జిల్లాల్లో ఎలాంటి మార్పులు లేవు:- మొత్తం 26 జిల్లాల్లో 17 జిల్లాల్లో మార్పులు చేస్తున్నామని, మిగిలిన 9 జిల్లాల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చిన స్పందన, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే ఈ మార్పులు చేపట్టినట్లు వివరించారు. పోలవరం జిల్లాను రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.17 జిల్లాల్లో మొత్తం 25 మార్పులు చేసినట్లు తెలిపారు. గూడురులోని మూడు మండలాలను నెల్లూరు జిల్లాలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. రంపచోడవరం ప్రాంతంలో గిరిజనుల అభివృద్ధి కుంటుపడకుండా ఉండేందుకు, ఒకే పార్లమెంట్ పరిధిలో మూడు జిల్లాలు ఉన్నా కూడా ఈ జిల్లా ఏర్పాటు చేశామని వివరించారు.
28 జిల్లాలకే పరిమితం:- గత ప్రభుత్వం జిల్లాల విభజన సరిగ్గా చేపట్టలేదని ఆరోపించిన కూటమి ప్రభుత్వం,, పునర్విభజనలో భాగంగా కొత్తగా మూడు జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.29 జిల్లాల బదులు 28 జిల్లాలకే పరిమితం చేసింది మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటును కేబినెట్ ఆమోదించింది. మార్కాపురం, గిద్దలూరు, కనిగిర, యర్రగొండపాలెం కలిపి ఒక జిల్లాగా త్వరలో ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు,, అన్నమయ్య జిల్లా పేరును అలాగే ఉంచి,, రాయచోటి కాకుండా మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక బనగానపల్లె, అడ్డరోడ్లను డివిజన్లుగా ఏర్పాటు చేయనుండగా. పెనుగొండను వాసవీ పెనుగొండగా మార్చాలని నిర్ణయించారు. అలాగే ఆదోనిలో పరిపాలనా సౌలభ్యం కోసం మండలాల సంఖ్యను పెంచి ఆదోని–1, ఆదోని–2గా విభజించినట్లు ప్రకటించారు. విశాఖలో ఆస్పత్రి నిర్మాణానికి భూమి కేటాయించారు. జనవరి 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం స్ఫష్టం చేసింది. అలాగే డివిజన్లు, మండలాలను మార్చడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

