కేసీఆర్ కుమారై ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీఆర్ఎస్
హైదరాబాద్: భారతీయ రాష్ట్ర సమితి (BRS-పూర్వం TRS) పార్టీ అధిష్టానం కఠినమైన నిర్ణయం తీసుకుంది.. ఆ పార్టీ మహిళా నేత,,KCR కుమారై ఎమ్మెల్సీ కవితపై సస్పెన్షన్ వేటు వేసింది.. BRS ప్రధాన కార్యదర్శులు సోమా భారత్,, రవీందర్ రావు పేరుతో కవితపై సస్పెన్షన్ వేటుకు సంబంధించిన లేఖ విడుదలైంది..ఇటీవలి కాలంలో ఎమ్మెల్సీ కవిత పార్టీ పట్ల ప్రవర్తిస్తున్న తీరు,, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నాయని,, పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని,, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని ఈ లేఖలో పేర్కొన్నారు.