గోషామహల్ బీజెపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన బీజెపీ
హైదరాబాద్: ఒల్డ్ సిటీ గోషామహల్ బీజెపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది.. ఇటీవల జరిగిన BJP రాష్ట్ర అధ్యక్ష ఎంపికలో పాల్గొనేందుకు ప్రయత్నించిన రాజాసింగ్ సాంకేతిక కారణలతో ఆయన నామినేషన తిరస్కరణకు గురైంది..అయితే ఈ విషయంను మరుగుపరచి,,కావలనే తన నామినేషన్ తిరస్కరించారని మీడియా మందు అసంతృప్తి వ్యక్తం చేశారు..అలాగే రాంచందర్‌రావుకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నా రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు.. జూన్ 30న తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపారు.. గతంలో రాజాసింగ్,,పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పని చేసిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,,బండి సంజయ్‌లపై అనేక ఆరోపణలు చేశారు..రాజాసింగ్ రాజీనామాను పార్టీ ఎట్టకేలకు ఆమోదం తెలిపడంతో,, ప్రస్తుతం అమర్‌నాథ్ యాత్రలో వున్న రాజాసింగ్, యాత్ర నుంచి రాగానే తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

