AP&TGCRIME

అవినితి తిమింగలం దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి అరెస్ట్

2024 జులై నుంచి సస్పెన్షన్‌లో..

అమరావతి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కాళింగిరి.శాంతిని ఏసీబీ అరెస్ట్ చేసింది. శాంతిని తాడేపల్లి నుంచి విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలింపు. తాడేపల్లి నివాసంతో సహా బంధువుల నివాసాల్లో తనిఖీలు చేసిన ఏసీబీ.మంగళవారం తాడేపల్లి, ఉండవల్లితో సహా 4 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించగా భారీగా అక్రమాస్తులు బయట పడ్డాయి.

బారీగా ఆస్తులు:- ఏసీబీ అధికారుల తనిఖీల్లో వోక్స్‌ వ్యాగన్ పోలో కారు,విలువైన పత్రాలు, బ్యాంక్ లాకర్లు,ఇతర ఆస్తులకు సంబంధించిన రికార్డులను ఏసీబీ డీఎస్పీ స్రవంతి ఆధ్వర్యంలో 25 మంది అధికారులు శోధించారు. విశాఖ ఎండాడలో లగ్జరీ ఫ్లాట్, తాడేపల్లి కుంచనపల్లిలో G+2 భవనం, 770 గ్రాముల బంగారు నగలు, 3 కిలోల వెండి, అదే విధంగా 1.15 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.3 లక్షలను గుర్తించారు. అంతేకాకుండా వోక్స్‌ వ్యాగన్ పోలో కారు, ద్విచక్రవాహనాన్ని సైతం గుర్తించారు.

2024 జులై నుంచి సస్పెన్షన్‌లో:- అక్రమాల ఆరోపణలతో 2024 జులై నుంచి 2026 మార్చి వరకు సస్పెన్షన్‌లో ఉన్న శాంతి, ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంది. వైసీపీ హయాంలో నాటి పెద్దల అండతో వివాదాలకు కేంద్రబిందువుగా మారిన శాంతి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయి.దింతో ఏసీబీ దాడులు నిర్వహించింది. త్వరలోనే వివరాలు అందచేస్తామని ఏసీబీ డీస్పీ తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *