AP&TG

గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు..

అమరావతి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశిస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తూ, విభజన సమస్యలతో పాటు వారసత్వంగా వచ్చిన ఆర్ధిక కష్టనష్టాలతో ప్రభుత్వం పాలన ప్రారంభించిందని, విభజన తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గత పాలకులు ధ్వంసం చేశారని గవర్నర్ తెలిపారు. వ్యవస్థలను నిర్వీర్యం చేయడంతో అభివృద్ధి ఆగిపోవడంతో, ఆర్ధిక పరమైన ఇబ్బందులు రాష్ట్రంలో పెరిగాయన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా గత పాలకులు వ్యవహరించారని,రెవెన్యూకు సంబంధించి 22ఏ దుర్వినియోగం చేశారని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం పాలన చేపట్టిన తరువాత రాష్ట్ర ఆర్దిక పరిస్థితి చక్కదిద్దుతూ, బలహీన వర్గాలు, మహిళల అభ్యున్నతికి కృషిచేస్తున్నామన్నారు. సంక్షేమ పథకాల అమల్లో డిజిటల్‌ విధానం ప్రారంభించడంతో పాటు అన్న క్యాంటీన్లతో అన్నార్థుల ఆకలితీరుస్తున్నామన్నారు. రాష్ట్రంను ఐటీ హబ్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నమని,,టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తూ  జాతీయస్థాయి విద్యాసంస్థల ఏర్పాటుకు కృషిచేస్తున్నామన్నారు. ఏపీని డ్రగ్స్‌ ఫ్రీ స్టేట్‌గా మార్చేందుకు చర్యలు చేపట్టామన్నారు.

17 రోజులపాటు:- మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని, అవసరమైతే పొడిగించాలని నిర్ణయించారు. 17 రోజులపాటు అసెంబ్లీ కార్యకలాపాలు నిర్వహించనున్నారు.ఈనెల 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మహా శివరాత్రి తర్వాత రోజు 16న సెలవు ప్రకటించారు.17, 18 తేదీల్లో బడ్జెట్పై చర్చ జరగనుంది.18న ఆర్థిక మంత్రి సమాధానం ఇవ్వనున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *