వివాదంలో మరో టీడీపీ ఎమ్మెల్యే-ఆధారాలతో సహా బయటపెట్టిన అటవీ శాఖ అధికారులు
ఎమ్మెల్యేల తీరుతో ప్రభుత్వంకు చెడ్డపేరు..
అమరావతి: శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తన అనుచరుల వచ్చి దౌర్జన్యం చేశారని,, వాహనాల్లో తమ సిబ్బందిని బంధించి,, కొట్టుకుంటూ రాత్రంతా రెండు గంటలపాటు శ్రీశైలం అడవులలో తిప్పేరాని అటవీశాఖ అధికారులు అరోపించారు..మీడియా సమావేశంలో మాట్లాడుతూ అడవుల్లో తిప్పిన తరువాత ఎమ్మెల్యేకు చెందిన గెస్ట్ హౌస్ లో బంధించి దాడి చేసి, వాకీటాకీలు, మొబైల్స్, తీసుకున్నారని అధికారులు ఆరోపించారు..ఈ ఘటనపై అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేస్తామని, ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరతామని తెలిపారు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్, వీడియోలు కూడా అధికారులు విడుదల చేశారు..జరిగిన విషయం తమ పై అధికారులకు తెలిపామన్నారు.