AP&TG

ఆంధ్రప్రదేశ్ 16 నెలల్లో అభివృద్ధి వైపు డబుల్‌ ఇంజిన్‌లా దూసుకుపోతోంది-ప్రధాని మోదీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ నేమ్,,అలాగే సంస్కృతి,,సంప్రదాయలకి నిలయంగా ఉందని,, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలోనూ యువతకు కావల్సినన్ని అవకాశాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.గురువారం కర్నూలు జిల్లాలోని నన్నూరులో ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్’ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించారు. ఈ సభలో సోదర, సోదరీమణులకు నమస్కారం అంటూ తెలుగులో మోదీ ప్రసంగించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ రూపంలో ఆంధ్రప్రదేశ్ కి శక్తివంతమైన నాయకత్వం ఉందని ప్రశంసించారు. తొలుత రూ. 13,430 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి, శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేశారు.

16 నెలల్లో అభివృద్ధి డబుల్‌ ఇంజిన్‌లా:- కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఏపీకి సహకారం అందిస్తున్నామని దింతో 16 నెలల్లో అభివృద్ధి డబుల్‌ ఇంజిన్‌లా దూసుకుపోతోందని చెప్పారు.ఏపి అభివృద్ధి కోసం ఢిల్లీ,, అమరావతి కలిసి పనిచేస్తున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు. అహోబిళం,,మహానంది,, మంత్రాలయం స్వాముల ఆశీస్సులు కోరుకుంటున్నామని,, ద్వితీయ జ్యోతిర్లింగమైన మల్లికార్జునస్వామి ఆశీస్సులు పొందానని తెలిపారు. తాను సోమనాథుడు కొలువైన గడ్డపై (గుజరాత్) పుట్టానని,, విశ్వనాథుడికి సేవ చేసే భాగ్యం కలిగిందని అన్నారు.

అమెరికా వెలుపల అతిపెద్ద పెట్టుబడి:- ‘వికసిత్‌ భారత్‌ లక్ష్యానికి స్వర్ణాంధ్రప్రదేశ్ ఎంతో సహకారం అందిస్తోంది అని అన్నారు. భారత్‌, అంధ్రప్రదేశ్ లో వేగంగా జరుగుతున్న అభివృద్ధిని ప్రపంచమంతా గమనిస్తోందని,, గూగుల్‌ వంటి కంపెనీ ఏపీలో పెట్టుబడి పెడుతోందని చెప్పారు. అమెరికా వెలుపల అతిపెద్ద పెట్టుబడి అంధ్రప్రదేశ్ లో పెడుతున్నట్లు గూగుల్‌ సీఈవో కురియన్ చెప్పిన సంగతి గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ వెంట ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటివ్ సీ.ఎం పవన్ కళ్యాణ్,,ఐ.టీ మంత్రి నారా.లోకేష్,బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు మధవ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *