రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అంబటి విడుదల
మళ్లీ రాజమండ్రికా? నెల్లూరుకా?
అమరావతి: రాజమండ్రి సెంట్రల్ జైల్లో తాను గడిపిన 18 రోజులను శిక్ష కాలంగా చూడలేదని,,తనకు ఈ సమయంలో ట్రైనింగ్ సెంటర్ గా అన్పించిందని వ్యాఖ్యనించారు. సంక్రాంతి పండుగ సందర్బంలో నిర్వహించిన లక్కీ డ్రా కేసులో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట లభించింది. గుంటూరు కోర్టు బుధవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అంబటి విడుదల అయ్యారు. ఈ సందర్బంలో ఆయన మీడియాతో మాట్లాడారు.18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో తాను ఉన్నానని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ కక్షగట్టి తనను జైల్లో పెట్టారని ఆరోపించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని.. వెనుకడుగు వేయనని స్పష్టం చేశారు.అంబటి మళ్లీ జైలు పక్షిగా మారకుండా వుండాలంటూ,,(కూటమి నాయకులతో రాజీ ప్రయత్నాలు) తెర వెనుక రాజకీయాలు చేస్తే తప్ప మరో మార్గం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఇది జరిగే పనేనా? ఈ సారి అంబటి రాజమండ్రికా ? లేక నెల్లూరుకా? కాలమే సమాధానం ఇస్తుంది మరి…..

