అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్-రాజమండ్రి సెంట్రల్ జైలుకు..
పుష్ప సినిమా స్టైల్ లో..
అమరావతి: వైసీపీ నేత అంబటి రాంబాబుకు గుంటూరు స్పెషల్ ప్రిన్సిపల్ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. బుధవారం సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల లక్కీడ్రా టికెట్ల అవినీతి కేసులో పీటీ వారెంట్‌పై అంబటి రాంబాబును గుంటూరు కోర్టుకు పోలీసులు తీసుకువచ్చారు. దింతో అంబటిని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
పుష్ప సినిమా స్టైల్ లో:- అంబటిని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు మిని బస్సులో తరలిస్తూన్న సమయంలో,అయన మీడియాకు పుష్ప సినిమాలో అల్లు.ఆర్జున్ స్టైల్ లో గెడ్డంపై చెయ్యి పెట్టి ఫోజూ ఇచ్చారు.

