జైలు పక్షిగా మారిన అంబటి-నోటి దూల మహత్యం
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుపై గలీజు వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చినప్పటికి మరో కేసులో సోమవారం మధ్యాహ్నం స్పెషల్ జుడీషియల్ కోర్టు అంబటికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో మొదటి కేసులో బెయిల్ లభించినా ఆయన జైలు నుంచి బయటికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. రాష్ట్రవ్యాప్తంగా అంబటిపై 52 కేసులు నమోదైనట్లు తెలుస్తొంది. ముఖ్యమంత్రి చంద్రబాబును దూషించిన కేసులో నల్లపాడు పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన కేసులో అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పట్టాభిపురం పోలీసు స్టేషన్ లో నమోదైన కేసులో కోర్టు అంబటికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అంబటిని రాజమండ్రి జైలుకి తరలించారు.నోటి దూల తీరే వరకు జైలు పక్షిలా అంబటి రాజమండ్రి జైల్లో ఉంటాడా?..

