భోగాపురం విమానాశ్రయాంలో ల్యాండ్ అయిన ఎయిర్ ఇండియా విమానం
అమరావతి: విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియాకు సంబంధించిన తొలి విమానం దిగ్విజయంగా ల్యాండ్‌అయ్యింది. ఆదివారం ఉదయం 10.15 గంటల ప్రాంతంలో వ్యాలిడేషన్ (టెస్ట్) ఫ్లైట్ ఢిల్లీ నుంచి భోగాపురంకు చేరుకుంది. ఈ విమానంలో పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏటీసీ చైర్మన్ తదితరులు ప్రయాణించారు.భోగాపురం విమానాశ్రయాన్ని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే 96 శాతం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినట్లు జీఎంఆర్ సంస్థ వెల్లడించింది. భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును జూన్ 26వ తేదీన ప్రారంభించనున్నారు.

