AP&TGHEALTHOTHERS

హోమి భాభా క్యాన్సర్ సెంటర్ లో మూడు సూపర్ స్పెషాల్టీ కోర్సులు-10 సీట్లతో ప్రవేశాలు

అమరావతి: దేశవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో 3 క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ కోర్సులను ప్రారంభించటానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. విశాఖపట్నంలోని ప్రఖ్యాత హోమి భాభా క్యాన్సర్ హాస్పిటల్-పరిశోధనా కేంద్రంలో 3 MCH కోర్సులను ప్రారంభించడానికి వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు MCH సర్జికల్ ఆంకాలజిలో ప్రతి ఏడాది 2 సీట్లకు, MCH గైనకలాజికల్ ఆంకాలజీలో 4 సీట్లకు, DM మెడికల్ ఆంకాలజిలో 4 సీట్లకు ప్రవేశాలు జరుగుతాయి. ఈ 3 విభాగాల్లో రాష్ట్రంలో ప్రస్తుతం 13 MCH సీట్లు మాత్రమే ఉన్నాయి. 120 పడకలతో కూడిన హోమి భాభా క్యాన్సర్ హాస్పిటల్-పరిశోధనా కేంద్రం భారత ప్రభుత్వం అందించే పూర్తి గ్రాంటుతో అణుశక్తి విభాగం పర్యవేక్షణలో పనిచేస్తున్న సంస్థ. మొత్తం 10 సీట్లతో 3 క్యాన్సర్ స్పెషాల్టీ కోర్సులను ప్రారంభించడానికి ముందుకు వచ్చిన ఈ సంస్థను మంత్రి సత్యకుమార్ అభినందించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *