రాష్ట్ర వ్యాప్తంగా 13 మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు-ప్రయోజనం ఏమైన వుంటుదా?
స్వాధీనం చేసుకుంటునే……….
రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపాల్ కార్పరేషన్స్ లో ఏసీబీ,విజిలెన్స్ డిపార్టమెంట్స్ ఆకస్మిక దాడులు,సోదాలు,రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకుంటునే………. వుంటారు. అవినితి కేసుల్లో పట్టుబడిన అధికారులు మాత్రం 6 నెలలు తిరగకుండానే మరో చోట పోస్టింగ్ లు తెచ్చుకుంటునే వుంటారు. ఏసిబీ,విజిలెన్స్ అధికారులు దాడుల్లో పట్టుబడిన అధికారులను దీర్ఘకాలం సస్పెండ్ చేశారా అంటే….????? ఏసిబీ,విజిలెన్స్ అధికారులు దాడుల తరువాత వారం మహా అయితే నెల రోజుల తరువాత ఈ విషయం గురించి అందరూ మర్చిపోతుంటారు. అటు తరువా అసలు పైరవీలు మొదలు అవుతాయి. ఇది షారా మాములే కదా అంటూ ప్రజలు నిటుర్పులు విడుస్తునే……..వుంటారు.
అమరావతి: విశాఖ, గుంటూరు, కడప, అనంతపురం మున్సిపల్ ఆఫీసుల్లో మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతపురం, శ్రీకాకుళం, ఏలూరు, తిరుపతి, నెల్లూరు టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినితి పేట్రేగి పొయిందని ఆరోపణలు వెల్లువెత్తడంతో ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు చేశారు. అనాధికార లేఅవుట్లు,,ఆక్రమ నిర్మాణాలు,,భవనాల క్రమబద్దికరణ,,పెండింగ్ ఫైల్స్ పై ఫిర్యాదు అందాయి. నెల్లూరులో ఏసీబీ డీస్పీ రాయుడు పరివేక్ష్యణలో కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులు ఇంజినీరింగ్ విభాగంలో రికార్డులను పరిశీలించారు. ఉద్యోగుల బయటకు వెళ్లానివ్వకుండా తనిఖీలు చేశారు.అలాగే గాజువాక, పెందుర్తి జోనల్ కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు. పలు ఆరోపణలపై రికార్డులు పరిశీలించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుసొంది. ఒంగొలు అధికారులు తనిఖీలకు వస్తున్నరన్న సమాచారం అందడంతో,ఉద్యోగస్తులు తమ వద్ద వున్న నోట్ల కట్టలను కీటికల్లో నుంచి విసిరి వేశారు.అయితే ఇది గమనించి అధికారులు నోట్ల కట్లను స్వాధీనం చేసుకుని, సంబంధిత వ్యక్తుల గురించి విచారిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగల్లో ఫైల్స్ అన్ని డౌన్‌లోడ్ చేసుకుని పరిశీలించినట్లు సమాచారం. ఏవైనా రూల్స్ డీవియేషన్స్ ఉన్నాయా? అనే విషయాన్ని సైతం ఈ సందర్భంగా పరిశీలించారు. అన్నింటిని పరిశీలించి, నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలుస్తొంది.

