రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ACB అధికారుల దాడులు
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో బుధవారం ACB అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై వచ్చిన పలు ఫిర్యాదుల నేపథ్యంలో మొత్తం 120 పైగా ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు..నెల్లూరులోని స్టోన్ హౌస్ పేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు కార్యాలయానికి తలుపులు వేసి పలు రికార్డులను పరిశీలిస్తున్నారు..అలాగే విశాఖ, అన్నమయ్య, కోనసీమ, ఏలూరుతో పాటు పలు జిల్లాల్లో ఏకకాలంలో ఏసీబీ దాడులు జరుగుతున్నాయి.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ సోదాలు చేస్తోంది.. కార్యాలయంలోకి బయట వ్యక్తులను అనుమతించకుండా ఏసీబీ అధికారులు గేట్లు వేసి సోదాలు చేస్తున్నారు.. సాధారణ తనిఖీల్లో భాగంగానే ఈ దాడులు చేస్తున్నామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు..

