హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్: నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.మొదటి అంతస్తులో మంటలు ఎగసిపడుతుండడంతో కార్యలయంలో వున్న ఉద్యోగులు ప్రమాదంపై సంబంధిత అధికారులకు సమాచారం అందించారు.వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, 5 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు పూర్తిగా అదుపు చేశారని సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. మొదటి అంతస్తులో కంప్యూటర్స్ ఉంటాయి,, షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని,, ఏ ఫైల్స్ తగలబడ్డాయో ఇంకా స్పష్టత లేదని డీసీపీ వెల్లడించారు.
DNA,,ఫింగర్ ప్రింట్ ట్రైసింగ్:- స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ కావడంతో కార్యాలయంలో నేర పరిశోధనకు సంబంధించిన ఫైల్ ఎవిడెన్స్ ల్యాబరేటరీ మొత్తం ఇక్కడి నుండే ఆపరేషన్ జరుగుతుంది. ముఖ్యమైన DNA,,ఫింగర్ ప్రింట్ ట్రైసింగ్ లాంటి కీలక సమాచారం ఇక్కడ వుంటుంది. ఫోరెన్సిక్ ల్యాబ్ ఫైర్ ఆక్సిడెంట్పై BRS నాయకుడు కేటిఆర్ స్పందిస్తూ “ఓట్ ఫర్ నోట్” కేసుకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్‌లను అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టించిన తప్పుడు ఆధారాలను కప్పిపుచ్చడానికి జరిగిన ప్రయత్నం అని అనుమానం వ్యక్తం చేశారు.

