కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం-9 మంది మృతి
10 మందికి గాయాలు..
అమరావతి: కడప అన్నమయ్య జిల్లాలోని రెడ్డిపల్లె చెరువుకట్టపై ఆదివారం అర్ధరాత్రి లారీ బోల్తా పడిన ప్రమాదంలో 9 మంది కూలీలు మృతిచెందగా, 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.. రాజంపేట నుంచి రైల్వే కోడూరుకు సమీపంలో పుల్లంపేట మండలం రెడ్డిచెరువు కట్టపై మామిడి లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పడంతో బోల్తాపడింది..మృతులంతా రైల్వేకోడూరు సెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన కూలీలని తెలుస్తొంది..మరణించిన వారిలో దాదాపుగా ఒకే కుటుంబానికి చెందిన దగ్గర బంధువులుని సమాచారం..
ముందున్న వాహానాన్ని లారీ ఓవర్ టేక్:- జిల్లాలో వర్షం కురుస్తుండడం,,అదే సమయంలో ముందున్న వాహానాన్ని లారీ ఓవర్ టేక్ చేసే క్రమంలో, రోడ్డు పక్కకు జారీ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం..సమాచారం అందుకుని సంఘటన స్థలంకు చేరుకున్న పోలీసులు గాయపడిన వారిలో రాజంపేట ప్రభుత్వాస్పత్రికి 5 మందిని,,4 గురిని కడప రిమ్స్ కు,,ఒకరిని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.