అమరావతిలో 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు
మార్చి 2026 లోగా..మంత్రి నారాయణ..
అమరావతి: అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ కు అమరావతిలో సీఎం చంద్రబాబు హామీ మేర శాఖమూరు పార్కులో 6.8 ఎకరాలు CRDA స్థలం కేటాయించింది..ఇందుకు సంబంధించిన భూమి కేటాయింపు పత్రాలను మంత్రి నారాయణ అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు డూండీ రాకేష్ అందచేశారు..మార్చి 2026 లోగా స్మృతి వనం ఏర్పాటు చేయాలని అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ కు మంత్రి నారాయణ సూచించారు.. ప్రభుత్వం భూమి కేటాయింపు చేయడం రాష్ట్ర ప్రజలందరికీ శుభవార్త అని,,58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహంతొ పాటు స్మృతి వనం ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు ట్రస్ట్ అధ్యక్షడు డూండీ.రాకేష్ తెలిపారు..భవిష్యత్తులో ఒక పెద్ద పర్యాటక ప్రాంతం గా అమరజీవి స్మృతి వనం అభివృద్ధి చెందుతుందని అకాంక్షను వ్యక్త చేశారు.