విశాఖ మీదుగా ప్రయాణించే 43 రైళ్లు రద్దు-ప్రధాని ఫోన్
కాకినాడలో మంత్రి నారాయణ..
8 జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు…
అమరావతి: మొంథా తుపాన్ నేపథ్యంలో విశాఖ మీదుగా ప్రయాణించే 43 రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేసింది..27,, 28,,29 తేదీలలో పలు రైళ్లు రద్దయ్యాయి..మొంథా తుపాన్ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కూడా అప్రమత్తమైంది.. ద.మ. రైల్వే జీఎం శ్రీవాత్సవ రైల్వే అధికారులకు పలు సూచనలు చేశారు..రైల్వే ట్రాక్స్ వెంట పెట్రోలింగ్ చేపట్టాలని,, ట్రాక్స్ వెంట నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు..
ప్రయాణానికి ముందు ట్రైన్ స్టేటస్‌ను చెక్ చేసుకోవాలి:- మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంటూ రద్దు చేసిన రైల్వే సర్వీసుల జాబితాను రైల్వే శాఖ విడుదల చేసింది. దానితో పాటు ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు ట్రైన్ స్టేటస్‌ను చెక్‌చేసుకోవాలని సూచింది. తుఫాను తీవ్రతను బట్టి తరువాత సర్వీసులను పునరుద్దరిస్తామని రైల్వేశాఖ స్పష్టం చేసింది.
24 గంటల్లో 8 జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు పోంచి వున్నది..ఇందులో విశాఖ, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు అవకాశం..
సీఎం చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ:- మొంథా తుపాన్ ప్రభావంపై సీఎం చంద్రబాబుతో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.. రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గురించి ప్రధాని మోదీకి, చంద్రబాబు వివరించారు.

కాకినాడలో మంత్రి నారాయణ సమీక్ష:- గతంలో విశాఖలో హుద్ హుద్ తుఫాన్,,నెల్లూరులో సంభంవించి తుఫాన్ లో యుద్ద ప్రతిపాదిక ముందస్తు చర్యలు,,తుఫాను తీరం దాటిన తరువాత చేపటాల్సిన విధులపై మంత్రి నారాయణకు వున్న అనుభవం మొంథా తుఫాన్ సమయంలో బాగా ఉపయోగ పడుతొంది. ముందస్తు చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

