ఎదురుకాల్పులో 28 మంది మావోయిస్టులు మృతి-కొలుకోలేని దెబ్బ
నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక మైలురాయిలాంటి విజయాన్ని సాధించామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు..బుధవారం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో జరిగిన ఆపరేషన్‌లో భద్రతా దళాలు 27 మంది భయంకరమైన మావోయిస్టులను మట్టుపెటాయని వెల్లడించారు..వీరిలో సీపీఐ-మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి, అగ్ర నాయకుడు, నక్సల్ ఉద్యమానికి వెన్నెముక అయిన నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజు ఉన్నారని అమిత్ షా నిర్ధారించారు..నక్సలిజంపై భారత్ చేస్తున్న మూడు దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన నాయకుడిని మన దళాలు మట్టుబెట్టడం ఇదే మొదటిసారని తెలిపారు.
హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ ఇంద్రవతి అభయారణ్యంలో (DRG) భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరుగుతున్న ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు 28 మంది మావోయిస్టులు మరణించనట్లు సమాచారం..వివరాల్లోకి వెళితే.. చత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్-నారాయణపూర్ జిల్లాల మధ్య గల మాథ్ డివిజన్ పరిధిలోని అబూజ్మాడ్ అడవుల్లో భద్రతా దళాలు కూబింగ్ నిర్వహిస్తున్న సమయలో బుధవారం వేకువజామున వారికి మావోయిస్టులు ఎదురుపడి, భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు..దీంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి..ఇప్పటి వరకు ఈ ఎదురు కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా ప్రాథమిక సమాచారం అందుతోంది..ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కేంద్ర కార్యదర్శి,,అగ్రనేత సంబళ్ల.కేశవరావు(బసవరాజు) మృతి చెందాడు..అలాగే ఎదురు కాల్సుల్లో ఒక జవాను గాయపడ్డాడని,,అయనకు ప్రాణపాయం లేదని ఛత్తీస్ గఢ్ డిప్యూటివ్ సీ.ఎం విజయశర్మ తెలిపారు..మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.. ఎదురు కాల్పులు జరుగుతున్నట్లుగా నారాయణపూర్ జిల్లా ఎస్పీ ప్రభాత్ కుమార్ స్పష్టం చేశారు..కొన్ని రోజుల విరామం తరువాత ఈ సంఘటన చోటు చేసుకోవడంతో ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో పోలీస్ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు..

