ఆత్మకూరులో బహిర్గతమైన జనసేన వర్గపోరు-ఇరువర్గాల మధ్య ఘర్షణ
ఆత్మకూరు నియోజకవర్గంలో తొలి నుంచి జనసేన జెండా భుజాన వేసుకుని తిరుగుతున్ననియోజకవర్గ ఇన్చార్జ్ నలిసెట్టి శ్రీధర్ ను పక్కకు పెట్టి టీడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ మరో వర్గంను ప్రోత్సహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ నేపద్యంలో ఆదివారం అది కాస్త చిలికి చిలికి గాలి వానల మారడమే కాకుండా దాడులు చేసుకోనే పరిస్థితి ఏర్పడింది.
కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు..
ఆత్మకూరు: 2024 ఎన్నికల్లో విజయం సాధించి, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నెల్లూరుజిల్లా జనసేనపార్టీ నియోజకవర్గ రాజకీయాల్లో అంతర్గతంగా విభేదలు ఏర్పాడుతున్న సూచనలు కన్సిస్తున్నాయి. పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ చిన్న చిన్న విషయాలు వుంటే సర్దుకుని పోవాలని పార్టీ నాయకులకు,కార్యకర్తలకు సూచిస్తునే వున్నారు. ఈ నేపధ్యంలో ఆత్మకూరు జనసేన పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయిందని నలిశెట్టి.శ్రీధర్ వర్గం ఆరోపణలకు దిగింది. పార్టీ పరంగా ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ఒక వర్గం డుమ్మా కొడుతూ వస్తుందన్న ఆరోపణలు వున్నాయి.ఈ ఆరోపణల నేపధ్యంలో ఆత్మకూరు జనసేన పార్టీ వర్గపోరు ఆదివారం ఆత్మకూరు బస్టాండ్ సాక్షిగా ఒక్కసారిగా బయటపడింది. ఆత్మకూరు నియోజకవర్గంలో అజయ్ కుమార్ జోక్యం జేసుకున్నప్పటి నుంచి జనసేన పార్టీ ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న నలిశెట్టి శ్రీధర్ వర్గానికి, వేములపాటి అజయ్ కుమార్ వర్గానికి పొసగకపోవడంతో ఆత్మకూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ రెండువర్గాలుగా చీలిపోయిందని స్థానికులు వ్యాఖ్యనిస్తున్నారు.
సమన్వయకర్తగా సూచించిన:- జనసేన ఉద్యమి సభ్యత్వానికి సంబంధించి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ను, పార్టీ అధిష్టానం నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించింది. ఈ నేపథ్యంలో బొలిశెట్టి శ్రీనివాస్ జిల్లాకు చేరుకుని నియోజకవర్గ ఇన్చార్జిలతో కలిసి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పనిచేయాలని సూచించారు. అలాగే ఆత్మకూరు నియోజకవర్గం జనసైనికలతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారం ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జిగా నలిశెట్టి శ్రీధర్ ఉన్నారని, నియోజకవర్గంలోప్రతి ఒక్కరూ శ్రీధర్ తో కలిసి పనిచేయాలని కోరారు.
10200 పైచిలుకు సభ్యత్వలు:- జనసేన సభ్యత్వ నమోదులో ఎప్పుడూ ముందంజలో నెల్లూరు సిటీ నియోజకవర్గం వుండేదని అయితే ఈ సంవత్సరం జరిగిన ఉద్యమి సభ్యత్వ నమోదులో ఆత్మకూరు నియోజకవర్గం ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్, గతంలో చేసిన 2514 సభ్యత్వలను మించి రికార్డు స్థాయిలో 10200 పైచిలుకు సభ్యత్వలను చేయడం జరిగిందని శ్రీధర్ వర్గం వెల్లడించింది.
తోపులాట, తీవ్రఘర్షణ:- ఈ నేపధ్యంలో ఏపీ టిడ్కో వేములపాటి అజయ్ కుమార్ వర్గం ఆదివారం జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆత్మకూరు బస్టాండ్ వేదికగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ విషయం నలిశెట్టి శ్రీధర్ కు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండానే సభను అజయ్ కుమార్ ఏర్పాటు చేయడంతో,విషయం తెలుసుకున్న నలిశెట్టి శ్రీధర్ వర్గం సభ్యత్వ నమోదు ప్రాంతానికి వచ్చి గో బ్యాక్ అజయ్ అంటూ నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట, తీవ్రఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో కొంత మంది కార్యకర్తలకు స్వల్ప గాయాలు కావడంతో సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ గంగాధర్, ఎస్సై జిలానీలు సిబ్బంది సహకారంతో ఇరువర్గాలను సర్థి చెప్పి గొడవ సద్దుమణిగేలా చేశారు.
వర్గపోరుతో ఆప్రతిష్టపాలు అయ్యే సూచనలు:- ప్రశాంతంగా ఉన్న ఆత్మకూరు నియోజకవర్గంలో వేములపాటి అజయ్ కుమార్ దువ్వూరు ప్రాంతం నుంచి పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా డబ్బులు ఇచ్చి జనాభాని తరలించారని శ్రీధర్ వర్గం ఆరోపిస్తొంది. కేవలం అజయ్ కుమార్ మాత్రమే కాకుండా ఆయన వర్గానికి సంబంధించి నూనె మల్లికార్జున్ యాదవ్, నూనె రిషికేష్ యాదవ్, గునుకుల కిషోర్, పవన్ యాదవ్ తదితరులు ఆ ప్రాంతంలో నానా హంగామా చేశారని శ్రీధర్ వర్గం ఆరోపిస్తుంది. క్రమశిక్షణ వున్న పార్టీగా పేరు తెచ్చుకుంటున్న జనసేన పార్టీ…ఆత్మకూరు నియోజకవర్గంలో తలైత్తిన వర్గపోరుతో ఆప్రతిష్టపాలు అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. మరి అధినాయకత్వం ఏ చర్యలు చేపడుతుందొ వేచిచూడాల్సిందే మరి…

