NATIONALOTHERSWORLD

ఇరాన్‌లోని అణు కేంద్ర నగరం ఇస్ఫహాన్‌‌పై అదివారం అమెరికా,ఇజ్రాయిల్ భీకర దాడులు

అమరావతి: ఇస్ఫహాన్ నగరంలోని ఇరాన్ కు అతి ముఖ్యమైన అణు విద్యుత్ ప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకుని, ఆదివారం ఉదయం అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు భీకరమైన వరుస దాడులు చేయడంతో అనేక ప్రాంతాల్లో పెద్ద పేలుళ్ల శబ్దాలు విన్నట్లు స్థానికులు తెలిపారని వార్త సంస్థలు పేర్కొన్నాయి. యుద్ధ విమానాలు ఆ ప్రాంతంలోకి ప్రవేశించిన వెంటనే పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు వెల్లడించారు. దాడుల సమయంలో విమానం చాలా తక్కువ ఎత్తులో ప్రయాణించి బాంబులు వేయడంతో, పెద్ద ఎత్తున నష్టం జరిగి వుంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న విమానాలను అమెరికన్,,ఇజ్రాయెల్ యుద్ధ విమానాలుగా గుర్తించారు. పశ్చిమ టెహ్రాన్‌లో ఉన్న స్పేస్ రీసెర్చ్ సెంటర్‌పై కూడా అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దళాలు దాడులు చేశాయి. ఇరాన్‌కు అవసరమైన శాటిలైట్ ఇంటెలిజెన్స్ మ్యాపింగ్ సమాచారం ఈ సెంటర్ నుంచే లభిస్తుంది. కీలకమైన ఈ సెంటర్‌పై దాడులు జరగడం ఇరాన్‌కు కోలుకోలేని దెబ్బే అని యుద్ద విశ్లేషకులు భావిస్తున్నారు.మరో వైపు ఇరాన్‌పై దాడుల కోసం అమెరికా తన వద్ద ఉన్న బి-52 బాంబర్‌ను పంపించింది.ఇది దాదాపు 38 టన్నుల బాంబులను తీసుకెళ్లగలదు. దీనికి సంబంధించిన వీడియోను యూఎస్ సెంట్రల్ కమాండ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ బి-52 బాంబర్‌తోనే టెహ్రాన్‌లో ఆదివారం ఉదయం దాడులు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *