చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ కన్నుమూత
హైదరాబాద్: చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు డాక్టర్ ఎం.వి. సౌందరరాజన్(90) పరమపదించారు.గత కొంతకాలం నుంచి వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న అయన నివాసంలోనే శుక్రవారం తుది శ్వాస విడిచారు.దేవాలయల స్వయం ప్రతిపత్తి కోసం హుండీలేని ఆధ్యాత్మిక పాలన కోసం అయన సుధీర్ఘపోరాటం చేశారు. ఆలయంలో హుండీ లేకుండా,విఐపీ దర్శనాలు లేకుండా అందరకీ సమానంగా స్వామి దర్శనం కల్పించారు. కళ్లు తెరచి స్వామిని చూడండి కళ్లు మూసుకుని కాదు అనే మాటలు భక్తుల్లో ఎంతో మార్పు తీసుకుని వచ్చింది. అయన తదనంతరం అయన కుమారుడు సీఎస్ రంగరాజన్, ఆలయ బాధ్యతలు కొనసాగిస్తారు.

