కోల్‌కతాలో భూ ప్రకంపనలు- రిక్టర్ స్కేల్‌పై 5.5 తీవ్రత నమోదు
అమరావతి: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో శుక్రవారం మధ్యాహ్నం 1:22 గంటల సమయంలో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై 5.5 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. భూకంప కేంద్రం బంగ్లాదేశ్‌లో ఉన్నట్లు పేర్కొంది. పది కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు వెల్లడించింది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలోని పలు జిల్లాలపై భూకంపం ప్రభావం ఉన్నట్లు వివరించింది. కోల్‌కతాలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకొవడంతో భయాందోళన చెందిన ప్రజలు ఇళ్లు, భవనాలు, కార్యాలయల నుంచి బయటకు పరుగులుతీశారు.భూప్రకంపనల కారణంగా ఏ మేరకు నష్టం జరిగింది అన్న విషయం తెలియరావల్సి వుంది.

